తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie) విడుదలకు సిద్ధమైంది. రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌ను కూడా చిత్ర బృందం దేశంలోని కీలక నగరాల్లో ఘనంగా నిర్వహించింది.
ఈ ఏడాది కొన్ని సినిమాల విషయంలో విడుదలకు కొన్ని గంటల ముందు వరకూ కూడా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ‘పెద్ది’ విషయంలో మాత్రం చిత్ర బృందం ముందుగానే ప్రణాళికతో వ్యవహరించింది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాకు జూన్ 3 రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఈ ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు టికెట్ ధరల పెంపుకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. జూన్ 3 ప్రత్యేక ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600 (జీఎస్‌టీతో కలిపి)గా నిర్ణయించారు. అలాగే జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. రోజుకు 5 షోలు ప్రదర్శించుకునే అవకాశం కూడా కల్పించారు.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలోని పలు నగరాల్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూన్ 5 ఉదయ ఆటకు సంబంధించిన టికెట్లు కూడా కొన్ని థియేటర్లలో అందుబాటులోకి వచ్చాయి.
ఇక తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అనుమతి రాకపోతే సాధారణ ధరలతోనే సినిమా విడుదల చేయాల్సి ఉంటుంది. గతంలో కొన్ని సినిమాలు ఇదే విధానంతో విడుదలై మంచి ఫలితాలు సాధించాయి.
ఓవర్సీస్ ప్రీమియర్లకు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవని, షోలు అనుకున్న సమయానికే జరుగుతాయని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















