దేశంలో అంకుర సంస్థలు, కొత్త కంపెనీలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే భారీ స్థాయిలో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు సృష్టించవచ్చని మేధో సంపత్తి సంస్థ భారత్ ప్రాజెక్ట్ పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో 10 లక్షల కంపెనీల ఏర్పాటుకు, వాటి ద్వారా 50 లక్షల వరకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని తన తాజా నివేదికలో తెలిపింది.
ఇందుకోసం కొత్తగా మరో ఔత్సాహిక పారిశ్రామిక పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని భారత్ ప్రాజెక్ట్ అభిప్రాయపడింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థల ద్వారా అమలవుతున్న పథకాలు, ఆర్థిక సహాయం, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవకాశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి ‘జాతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మిషన్’ పరిధిలోకి తీసుకురావాలని సూచించింది.
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని నివేదిక పేర్కొంది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి పథకాలతో పాటు ఇటీవల తీసుకొచ్చిన రూ.లక్ష కోట్ల రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలు అంకుర సంస్థలకు మద్దతు ఇస్తున్నాయి.
అయితే ఈ పథకాలు వేర్వేరు మంత్రిత్వ శాఖలు, సంస్థల పరిధిలో విడివిడిగా కొనసాగుతుండటంతో వ్యవస్థాపకులు తమ ప్రయాణంలోని ప్రతి దశలో కొత్తగా మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోందని నివేదిక అభిప్రాయపడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు డీపీఐఐటీ, డీఎస్‌టీ, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఎంఎస్‌ఎంఈ శాఖ, ఆర్థిక సంస్థలు తదితరాల పథకాలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలని సూచించింది.
ప్రతి వ్యవస్థాపకుడికి జీవితాంతం ఉపయోగపడే విధంగా ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాస్‌పోర్ట్’ తరహా వ్యవస్థను రూపొందించాలని ప్రతిపాదించింది. దీని ద్వారా అంకుర సంస్థ స్థాపన నుంచి నిధులు, మెంటార్‌షిప్, సాంకేతిక సహాయం, మార్కెట్ అవకాశాల వరకు అవసరమైన సేవలను ఒకే చోట పొందే అవకాశం ఉంటుంది.
నివేదికలోని ఇతర కీలక సూచనలు :
- జిల్లా స్థాయిలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీ మ్యాప్స్’ రూపొందించాలి.
- దేశవ్యాప్తంగా వ్యాపార ఆలోచనలకు ఉపయోగపడేలా ‘ఐడియా బ్యాంక్’ ఏర్పాటు చేయాలి.
- ప్రభుత్వ నిధులతో నడిచే ప్రతి వెంచర్‌కు ఒక మెంటార్‌ను నియమించాలి.
- నమోదైన ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు బహుభాషా కృత్రిమ మేధ సహాయకుడిని అందుబాటులోకి తీసుకురావాలి.
- జీఈఎం, ఓఎన్‌డీసీ వంటి డిజిటల్ వేదికల ద్వారా అంకుర సంస్థలకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించాలి.
- విద్యార్థులను కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా వాస్తవ మార్కెట్‌లో ఉత్పత్తులు, సేవలను విక్రయించే అనుభవం కల్పించేలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను రూపొందించాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















