గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్ రాష్ట్రానికి అనేక దేశాల నుంచి భారీ పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు వేగంగా అందుబాటులోకి తెస్తున్నామని, పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. “ఏపీలో అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం విస్తృతంగా ఉంది. సమర్థ నాయకత్వంతో ప్రాజెక్టులు నిర్ణీత సమయానికి పూర్తవుతాయి” అని ఆయన పేర్కొన్నారు.
శ్రీసిటీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNews TrendingNow ViralNews WorldNews



















