అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. అయతుల్లా ఖమేనీ మృతి చెందగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారంలో ఉన్నప్పటికీ, కీలక నిర్ణయాలన్నీ ఐఆర్‌జీసీ (Islamic Revolutionary Guard Corps) చేతుల్లోకి వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా నియామకాల విషయంలో కూడా సైనిక వ్యవస్థ జోక్యం పెరిగిందని తెలుస్తోంది.
మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ ప్రభావంతో అధ్యక్షుడి నిర్ణయాలు అమలు కావడం లేదని, యుద్ధ సమయంలో కీలక పదవుల నియామకాలు తామే నిర్ణయిస్తామని ఐఆర్‌జీసీ పట్టుబడుతోందని సమాచారం.
ఇక మొజ్తాబా ఖమేనీ చుట్టూ ఐఆర్‌జీసీ వలయంలా ఏర్పడి, ఆయనను కలిసే మార్గాలను కూడా నియంత్రిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ నివేదికలు కూడా వారి నియంత్రణలోనే ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు జారీ చేసింది. తమ శత్రువులకు సహాయం చేస్తే ఆయా దేశాలపై దాడులు చేస్తామని తీవ్రంగా హెచ్చరించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















