అమెరికాకు చెందిన ప్రముఖ ట్రేడింగ్ సంస్థ జేన్‌స్ట్రీట్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టాక్ మార్కెట్‌లో అక్రమ పద్ధతుల్లో లాభాలు ఆర్జించిందన్న ఆరోపణలతో గతంలో సెబీ చర్యలు ఎదుర్కొన్న ఈ సంస్థ.. ఇప్పుడు అమెరికా మార్కెట్లలో మరో భారీ నష్టాన్ని చవిచూసినట్లు సమాచారం. జేన్‌స్ట్రీట్ నేరుగా ట్రేడింగ్‌లో భారీ నష్టాన్ని చవిచూడకపోయినా.. అది పెట్టుబడి పెట్టిన హెడ్జ్‌ఫండ్ తీవ్రంగా నష్టపోవడంతో సంస్థకూ భారీ దెబ్బ తగిలింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లియోపోల్డ్ ఆస్చెన్‌బ్రెన్నర్ స్థాపించిన ‘సిట్యువేషనల్ అవేర్‌నెస్’ అనే హెడ్జ్‌ఫండ్ సెమీకండక్టర్ కంపెనీల షేర్లపై భారీగా పెట్టుబడులు పెట్టింది. 24 ఏళ్ల ఆస్చెన్‌బ్రెన్నర్ గతంలో ఎఫ్‌టీఎక్స్, ఓపెన్‌ఏఐలో పనిచేశారు. అయితే చిప్ కంపెనీల షేర్లపై వేసిన భారీ పందెం బెడిసికొట్టడంతో ఆయనకు చెందిన హెడ్జ్‌ఫండ్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
సిట్యువేషనల్ అవేర్‌నెస్ జూన్‌లో శాన్‌డిస్క్‌లో సుమారు 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే జులైలో ఈ రెండు కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. శాన్‌డిస్క్ షేరు సుమారు 47 శాతం, మైక్రాన్ టెక్నాలజీ షేరు దాదాపు 29 శాతం పడిపోయాయి.
దీంతో ఒక్క నెలలోనే హెడ్జ్‌ఫండ్ పోర్ట్‌ఫోలియో విలువలో భారీ కోత పడింది. పోర్ట్‌ఫోలియోలో దాదాపు 10 శాతం వాటా ఉన్న బ్లూమ్ ఎనర్జీ షేర్లు కూడా జులైలో సుమారు 31 శాతం క్షీణించాయి. టీఎస్‌ఎంసీ, నెబియస్ వంటి కంపెనీల్లో చేసిన పెట్టుబడులు సైతం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
ఫలితంగా సుమారు 45 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఫండ్ విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు సమాచారం. ఈ పరిణామంతో సిట్యువేషనల్ అవేర్‌నెస్‌లో పెట్టుబడులు కలిగిన జేన్‌స్ట్రీట్‌కు కూడా భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జేన్‌స్ట్రీట్ నష్టం దాదాపు 15 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.25 లక్షల కోట్లకు పైమాటే.
భారత స్టాక్ మార్కెట్‌లో ఇండెక్స్ ధరలను ప్రభావితం చేసి అక్రమంగా లాభాలు ఆర్జించిందన్న ఆరోపణలపై జేన్‌స్ట్రీట్‌పై సెబీ గతంలో చర్యలు తీసుకుంది. మార్కెట్ ధరలను ప్రభావితం చేసే విధంగా ట్రేడింగ్ చేసి మదుపరులను నష్టపరిచినట్లు సెబీ తన దర్యాప్తులో గుర్తించింది.
సెబీ లెక్కల ప్రకారం జేన్‌స్ట్రీట్ గ్రూప్ సంస్థలు దాదాపు రూ.44,358 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్లు గుర్తించింది. నష్టాలను మినహాయించిన తర్వాత నికర అక్రమ లాభం సుమారు రూ.36,671 కోట్లుగా నిర్ధారించింది. ఈ వ్యవహారంలో భాగంగా సుమారు రూ.4,843 కోట్లు జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది.
భారత మార్కెట్‌లో సెబీ చర్యలు ఎదుర్కొన్న ఏడాది వ్యవధిలోనే.. జేన్‌స్ట్రీట్‌కు సంబంధం ఉన్న పెట్టుబడులు అమెరికాలో భారీ నష్టాన్ని చవిచూడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















