భారత్–అమెరికా మధ్య ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా ఖరారయ్యే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్‌కు సంబంధించి వచ్చేవారంలో రెండు దేశాల నుంచి సంయుక్త ప్రకటన వెలువడనుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) తుదిరూపు సిద్ధమవుతోందని, అన్ని అంశాలపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరిందని మంత్రి తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మార్చి మధ్య నాటికి ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారత్–అమెరికా మధ్య ఈ ఎఫ్‌టీఏ అమలులోకి వస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, తయారీ రంగాలు, వ్యవసాయ ఉత్పత్తులు, సేవల రంగంలో భారత్‌కు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అధికారిక పోస్టుల్లో ఎఫ్‌టీఏ అంశంపై ప్రత్యక్ష ప్రస్తావన లేకపోవడంతో కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన ప్రకటనతో భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై స్పష్టత వచ్చింది. త్వరలో వెలువడనున్న సంయుక్త ప్రకటనతో ఈ ఒప్పందం అధికారికంగా మరో కీలక దశకు చేరుకోనుందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.ఈ డీల్ అమలుతో భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్‌లో మరింత ప్రోత్సాహం, దిగుమతి–ఎగుమతి విధానాల్లో సరళత, అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ మరింత ఆకర్షణీయంగా మారే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















