‘కాలా హిరణ్’ సినిమా టీజర్ తొలగింపు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. టీజర్, ప్రచార చిత్రాలు, ఇంటర్వ్యూ లింక్‌లను తొలగించాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాత అమిత్ జానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ‘కాలా హిరణ్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ’ టీజర్‌లో తనను పోలిన పాత్రను చూపించారని, అందులో తనకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన నీలిరంగు బ్రాస్‌లెట్ తరహా ఆభరణాన్ని ఉపయోగించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీజర్‌తో పాటు దానికి సంబంధించిన ప్రచార కంటెంట్, ఇంటర్వ్యూ లింక్‌లను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ ఉత్తర్వులను నిర్మాత అమిత్ జానీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఆదేశాలు తమ భావప్రకటనా స్వేచ్ఛను ప్రభావితం చేస్తున్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాను నిలిపివేయాలని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించినట్లు తెలుస్తోంది.
ఇక సల్మాన్ ఖాన్ గతంలో ఎదుర్కొన్న 1998 కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలోనే ‘కాలా హిరణ్’ తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీజర్ తొలగింపు వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















