కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. మొత్తం 140 స్థానాల్లో ఇప్పటికే 100కు పైగా సీట్లు గెలుచుకుని ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పూతుపల్లి నియోజకవర్గంలో చాందీ ఊమెన్ భారీ విజయాన్ని నమోదు చేశారు.
తన ప్రత్యర్థి ఎల్డీఎఫ్ అభ్యర్థి కేఎం రాధాకృష్ణన్‌పై 52,907 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఆయన, సోషల్ మీడియా వేదికగా ‘నాన్నా.. మనమే గెలిచాం’ అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో తన తండ్రి, మాజీ సీఎం ఊమెన్ చాందీ సమాధి వద్ద నిలబడి ఉన్న ఫోటోను పంచుకోవడం అందరినీ కదిలించింది.
గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఊమెన్ చాందీ దశాబ్దాల పాటు రాజకీయంగా ప్రభావం చూపగా, ఆయన మరణానంతరం అదే సీటులో కుమారుడు చాందీ ఊమెన్ విజయం సాధించడం ప్రత్యేకతగా నిలిచింది.
ప్రచారంలో భాగంగా చాందీ ఊమెన్ సైకిల్‌పై నియోజకవర్గమంతా తిరిగి ప్రజలను స్వయంగా కలుసుకున్నారు. ఖర్చులను తగ్గించేందుకు ఫ్లెక్సీలు, పోస్టర్లకు దూరంగా ఉండటం, ప్రచార నిధులను నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తానని ప్రకటించడం వంటి నిర్ణయాలు ప్రజల్లో మంచి స్పందన తెచ్చాయి.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న చాందీ ఊమెన్, యువ నాయకుడిగా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















