దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మంజూరైన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. మూడు వారాల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. సోనమ్ సుదీర్ఘకాలం బెయిల్‌పై బయట ఉంటే కేసు విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ గతేడాది మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట ఆ తర్వాత కనిపించకుండా పోయింది. 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహం సోహ్రా సమీపంలోని ఓ జలపాతం వద్ద లోయలో లభ్యమైంది. మృతదేహంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో సోనమ్ తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో సోనమ్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోనమ్‌కు దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా దానిని సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సోనమ్ బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















