ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా ఉపయోగించుకుంటున్న పాకిస్థాన్.. అసత్య ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ మండిపడింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.
ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఉన్నతస్థాయి చర్చ సందర్భంగా పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దీటుగా బదులిచ్చారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్నది చట్టపరమైన వాస్తవమని స్పష్టం చేశారు. కశ్మీర్‌కు సంబంధించి పరిష్కరించాల్సిన ఏకైక అంశం పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతమేనని పేర్కొన్నారు.
సింధూ జలాల ఒప్పందంపై భారత్ విధానంలో ఎలాంటి మార్పు లేదని హరీశ్ పునరుద్ఘాటించారు. పరస్పర విశ్వాసం, సత్సంకల్పంతోనే ఇరు దేశాల మధ్య సహకారం సాధ్యమవుతుందని తెలిపారు. అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు అంతర్జాతీయ ఒప్పందాల ప్రయోజనాలు కోరుకోవడం సరికాదని పాకిస్థాన్‌ను దుయ్యబట్టారు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని.. ముందుగా తమ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















