ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారబోతున్న మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఏప్రిల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి పోర్టును పూర్తిస్థాయిలో కార్యకలాపాలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల పురోగతిని ముఖ్యమంత్రి N. చంద్ర బాబు నాయుడు గారు ప్రతి నెలా సమీక్షిస్తున్నారు.
ఇదీ ప్రాజెక్టు స్వరూపం
తొలి దశలో 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో
1,500 ఎకరాల్లో నిర్మాణం
మొత్తం అంచనా వ్యయం రూ.4,361 కోట్లు
అంతర్గత పనులకు రూ.2,981 కోట్లు కేటాయింపు
ఇప్పటికే రూ.1,887 కోట్లు వ్యయం
మిగిలినవి భూసేకరణ, నిర్వాసిత కాలనీలకు వినియోగం
బ్రేక్‌వాటర్స్ పూర్తి
అలల తీవ్రతను తట్టుకునేలా నిర్మించిన సౌత్, నార్త్ బ్రేక్‌వాటర్స్ పనులు పూర్తయ్యాయి.
32 లక్షల టన్నుల రాయి వినియోగం
సౌత్ బ్రేక్‌వాటర్ – 2,450 మీటర్లు
నార్త్ బ్రేక్‌వాటర్ – 580 మీటర్లు
వేవ్‌వాల్ పనులు దాదాపు పూర్తి
బెర్తులు సిద్ధం
270 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో మూడు జనరల్ కార్గో బెర్తులు
అందులో రెండు పూర్తయ్యాయి
మూడోది ఏప్రిల్ చివరికి సిద్ధం
300 మీటర్ల కోల్ బెర్తు నిర్మాణం 50% పూర్తి
15.5 మీటర్ల లోతున డ్రెడ్జింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి
రోడ్డు, రైలు, నీరు, విద్యుత్తు అనుసంధానం
16వ జాతీయ రహదారి నుంచి 12.85 కి.మీ. రహదారి పనులు పూర్తి
చెన్నై–హావ్‌డా ప్రధాన రైల్వే లైన్ నుంచి 7.8 కి.మీ. రైల్వే కనెక్షన్ పనులు పురోగతి
హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి 50 కి.మీ. నీటి పైప్‌లైన్ పనులు
132 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు చర్యలు
పరిశ్రమలకు ద్వారం
పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశముంది. పోర్టుకు అనుబంధంగా 10 వేల ఎకరాలను పరిశ్రమల కోసం గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం మూలపేటను పారిశ్రామిక క్లస్టర్‌గా ప్రకటించింది. భారీ పరిశ్రమలు, ఎగుమతులు, దిగుమతుల ద్వారా వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా మూలపేట పోర్టు నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















