ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కవిత తండ్రి గతంలోనే మృతి చెందగా, తల్లి లూథియా ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నారు. కవిత తన ముగ్గురు అక్కలతో కలిసి చిట్టవరంలో పెదనాన్న ఇంట్లో నివసిస్తూ వచ్చింది. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో నాలుగు నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లి ఓ ఇంట్లో పనిలో చేరింది. అయితే ఈ నెల 23న ఆమె అక్కడి గదిలో ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన గురించి ఇంటి యజమాని కువైట్‌లో ఉన్న ఆమె తల్లికి మెసేజ్ పంపగా, సమాచారం స్పష్టంగా అర్థం కాక కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కవిత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై తెలుగు సంఘాల ప్రతినిధులు అక్కడి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ కుటుంబ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం అధికారులు తదుపరి చర్యలు చేపట్టే పనిలో ఉన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















