రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, కొరత కారణంగా 421 బంకులు మూతపడ్డాయని అధికారులు వివరించారు. దొరకదేమోనన్న భయంతో ప్రజలు ఎక్కువగా ఇంధనం కొనుగోలు చేయడం వల్ల కొన్ని చోట్ల నిల్వలు తక్కువయ్యాయని తెలిపారు.
ఇంధన కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ శనివారం రోజున పెట్రోల్ డిమాండ్ 34%, డీజిల్ డిమాండ్ 16% పెరిగిందని, ఆదివారం కూడా 22% పెరుగుదల నమోదైందని చెప్పారు. ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వెంటనే స్పందిస్తూ సోమవారానికి అన్ని బంకుల్లో ఇంధన సరఫరా సాధారణ స్థాయికి చేరాలని ఆదేశించారు. ఎక్కడా “నో స్టాక్” బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీసు, తూనికలు-కొలతల శాఖలతో కలిసి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆక్వా రైతులు, వరికోత యంత్రాలకు డీజిల్ కొరత లేకుండా కూపన్ విధానం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయిల్ కంపెనీలు రిటైల్ ఔట్‌లెట్లకు క్రెడిట్ ఇవ్వడంపై ప్రశ్నించిన సీఎం, ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంధన సరఫరా వ్యవస్థపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కూడా ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















