అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది రూపకల్పనపై చర్చించేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం లండన్‌లో పర్యటిస్తోంది. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి, అధికారులు ఆదివారం రాత్రి లండన్ చేరుకున్నారు.
అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల వెలుపలి రూపకల్పన (ఫసాడ్)పై ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులతో మంత్రి చర్చలు జరపనున్నారు. నార్మన్ అండ్ ఫోస్టర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, బ్యూరో హాపోల్డ్ కన్సల్టెన్సీ, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో సమావేశమై భవనాల డిజైన్లు, నిర్మాణ ప్రక్రియపై సమీక్షించనున్నారు.
ముఖ్యంగా అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించనున్న ఎత్తైన టవర్ డిజైన్‌పై చర్చ జరగనుంది. ఈ టవర్ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తూ పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతితో పాటు భవిష్యత్‌లో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని మరింత సమర్థంగా చేపట్టే అంశాలపై ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెంట్లతో మంత్రి చర్చించనున్నారు. మంత్రి నారాయణ వెంట సీఆర్‌డీఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్, పలువురు చీఫ్ ఇంజినీర్లు లండన్ వెళ్లారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















