కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)లో 376 సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-బీ, ఎస్ అండ్ టీ (నాన్-గెజిటెడ్) కేటగిరీకి చెందిన ఈ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఏ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్-2024, 2025 లేదా 2026 స్కోరు తప్పనిసరిగా ఉండాలి.
మొత్తం ఖాళీల్లో కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 300, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 26, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 50 పోస్టులు ఉన్నాయి.
ఎంపిక ఇలా..
విద్యార్హతలు, గేట్ స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా విభాగాలు, కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు తేదీ, వేదిక వివరాలను వారి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఈ ప్రక్రియను దిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
అర్హతలు :
కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంఎస్/ఎంసీఏ చేసినవారు అర్హులు. సంబంధిత సీఎస్, సీఈ, డీఏ విభాగాల్లో గేట్-2024/2025/2026 స్కోరు ఉండాలి. ఉద్యోగానుభవం అవసరం లేదు.
వయోపరిమితి :
దరఖాస్తు గడువు తేదీ నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
ఫీజు.. వేతనం :
అన్‌రిజర్వుడ్, ఓబీసీ-ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపికైన వారికి లెవెల్-6 పే స్కేల్ ప్రకారం నెలకు రూ.35,400 ప్రారంభ మూలవేతనం లభిస్తుంది. ఇతర అలవెన్సులను కలుపుకొంటే మొత్తం వేతనం నెలకు రూ.60,000కుపైగా ఉండే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















