నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ప్రతిపాదిత ఐపీఓ పరిమాణం తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఐపీఓకు ఆమోదం లభించిన నేపథ్యంలో.. ఇష్యూ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్‌ఎస్‌ఈ సిద్ధమవుతోంది.
తొలుత ఎన్‌ఎస్‌ఈలోని సుమారు 6 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించాలని భావించారు. అయితే తాజాగా ఈ వాటాను 5.2–5.5 శాతానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది వాటాదారులు తమ వాటాలను విక్రయించే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
తొలుత ఐపీఓ ద్వారా దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన నిధుల సమీకరణకు అవకాశం ఉంటుందని అంచనా వేశారు. అయితే భవిష్యత్తులో ఎన్‌ఎస్‌ఈ షేర్లకు మరింత అధిక విలువ లభించే అవకాశం ఉందని భావించిన కొందరు వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ నుంచి తమ వాటాలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
దీంతో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ విలువ రూ.25 వేల కోట్ల నుంచి రూ.27 వేల కోట్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కో షేరు ధర రూ.1,700–1,785 మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుత సమాచారం ప్రకారం ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెప్టెంబర్ 18న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై.. సెప్టెంబర్ 21న ముగిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్ల లిస్టింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఐపీఓ పరిమాణం, షేరు ధర, సబ్‌స్క్రిప్షన్, లిస్టింగ్ తేదీలపై తుది నిర్ణయం అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















