రాజస్థాన్‌లోని Alwarకు చెందిన యువ ఐఏఎస్ అధికారి Prem Prakash Meena తన సొంత పొలంలో హైటెక్ వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్ (మట్టి లేకుండా సాగు) విధానంలో సాగుచేసిన క్యాప్సికం పంటతో భారీ లాభాలు ఆర్జిస్తున్నారు.
మూడేళ్ల క్రితం సోషల్ మీడియాలో చూసిన ఓ వీడియో ప్రేరణగా తీసుకుని ఈ సాగుకు శ్రీకారం చుట్టిన ఆయన, ప్రస్తుతం దిల్లీ, గురుగ్రామ్ వంటి మెట్రో నగరాలకు తన ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. అల్వర్ సమీపంలో ఉన్న ఐదెకరాల పొలంలో ఈ సాగును ప్రారంభించగా, ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఒక పాలీహౌస్ నుంచి మూడు పాలీహౌస్‌ల వరకు విస్తరించారు.
ఈ వ్యవసాయాన్ని ఆయన తండ్రి Kaduram Meena పర్యవేక్షిస్తున్నారు. ఉద్యానశాఖ నుంచి 70% సబ్సిడీ అందడంతో పెట్టుబడి భారాన్ని తగ్గించగలిగారు. జైపూర్ నుంచి నాణ్యమైన ఎరుపు, పసుపు క్యాప్సికం విత్తనాలను తెప్పించి మొత్తం 18,000 మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు.
గత ఏడాది 32 టన్నుల దిగుబడి సాధించగా, ఈ ఏడాది 40 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్యాప్సికంతో పాటు చెర్రీ టమోటాలు, రెడ్ క్యాబేజీ కూడా సాగు చేస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















