ఈ మోడల్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో రూపొందించారు. పరిచయ ధరగా రూ.1,29,999గా నిర్ణయించగా, ఈ ప్రత్యేక ధర ఏప్రిల్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.పవర్ పరంగా ఈ స్కూటర్‌లో 11 కిలోవాట్ మిడ్-డ్రైవ్ మోటర్ అమర్చారు. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 320 కి.మీ వరకు రేంజ్ ఇవ్వగలదని కంపెనీ ప్రకటించింది. గరిష్ఠ వేగం గంటకు 125 కి.మీ వరకు ఉంటుంది.
సేఫ్టీ, కంట్రోల్ పరంగా కూడా కొత్త ఫీచర్లు జోడించారు. బ్రేక్-బై-వైర్ టెక్నాలజీతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు అమర్చడం ద్వారా బ్రేకింగ్ పనితీరు మెరుగుపరిచినట్లు కంపెనీ పేర్కొంది.ఈ లాంచ్‌తో తమ దేశీయ బ్యాటరీ సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. విద్యుత్ వాహన మార్కెట్లో దీర్ఘ రేంజ్, అధునాతన ఫీచర్లతో పోటీని మరింత పెంచేలా ఈ మోడల్ ఉందని భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















