సంక్రాంతి సీజన్లో తెలుగు బాక్సాఫీసు కళకళలాడినట్లే.. కేరళలో ఓనం పండగ సమయంలో మలయాళ చిత్రసీమలో సందడి నెలకొంటుంది. కేరళీయులు ఎంతో ఘనంగా జరుపుకొనే ఓనం వేడుకలు ఆగస్టు 16 నుంచి 26 వరకు కొనసాగనున్నాయి. ఈ పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు యాక్షన్, క్రైమ్, రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
ఖలీఫా: ది ఇంట్రో
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో ప్రతినాయకుడిగా కనిపించనున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖలీఫా: ది ఇంట్రో’. మాళవిక శర్మ కథానాయికగా నటించగా.. నీల్ నితిన్ ముకేశ్ విలన్‌గా కనిపించనున్నారు. కృతిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
మలయాళంలో తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచిన ‘పులి మురుగన్’ దర్శకుడు వైశాఖ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బెత్లెహాం కుడుంబ యూనిట్ :
గతేడాది క్రిస్మస్కు విడుదలైన ‘సర్వం మాయ’తో విజయాన్ని అందుకున్న నివిన్ పాలీ తాజాగా ‘బెత్లెహాం కుడుంబ యూనిట్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ప్రేమలు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమితా బైజు ఇందులో కథానాయికగా నటించారు. ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఎ.డి. దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది.
టాక్సిక్ :
‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’పై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో యశ్ తండ్రీకుమారులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.
నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. మలయాళ సినిమాతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.
ఐ యాం గేమ్ :
‘సీతారామం’, ‘లక్కీభాస్కర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘ఐ యాం గేమ్’. కయాదు లోహర్ ఇందులో కథానాయికగా నటించారు. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది.
ముందుగా ఆగస్టు 20న విడుదల చేయాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఓనం పండగ తర్వాత సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















