దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీసింది. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ద్రవ్యోల్బణ వ్యక్తి మోదీ’ అంటూ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విమర్శలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే ఇంధన ధరలను పెంచారని ఆరోపించింది. ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూ కేంద్రం వసూళ్లు ప్రారంభించిందని మండిపడింది.తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల అనంతరం ధరల పెంపు ఊహించిన విషయమేనని పేర్కొంది. ప్రజలపై భారం తగ్గించేందుకు విలువ ఆధారిత పన్ను (VAT) తగ్గిస్తారా అంటూ పశ్చిమబెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అంశంపై వ్యంగ్యంగా స్పందించారు. ‘ముందుకు సాగాలంటే సైకిల్ ఒక్కటే ఆప్షన్’ అంటూ సైకిల్ తొక్కుతున్న క్యారికేచర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కూడా సైకిల్ కావడం విశేషంపశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















