దేశంలోని యువ అంతరిక్ష పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. అంతరిక్ష సాంకేతికతను కేవలం రాకెట్లు, ఉపగ్రహాలకే పరిమితం చేయకుండా.. సామాన్యుల రోజువారీ అవసరాలకు ఉపయోగపడేలా కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని సూచించారు.
దిల్లీలో 20 దేశీయ అంతరిక్ష అంకుర సంస్థల సీఈఓలు, వ్యవస్థాపకులతో ప్రధాని సమావేశమయ్యారు. రిస్క్ తీసుకుని, సంస్కరణలను విశ్వసిస్తూ అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన యువ పారిశ్రామికవేత్తల సాహసాన్ని మోదీ అభినందించారు.
అంతరిక్ష రంగంలో ప్రపంచానికి బలమైన, వినూత్నమైన, వాణిజ్యపరంగా లాభదాయకమైన నమూనాలను అందించే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధాని స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంపై ఆలోచన వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
వ్యవసాయం, పశు సంరక్షణ, పాడి పరిశ్రమ, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో అంతరిక్ష సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. అంతరిక్ష సాంకేతిక సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేసి రైతులకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, పంట దిగుబడిని పెంచడంలో సహకరించాలని అన్నారు.
అంతరిక్ష వ్యర్థాల నిర్వహణపై పనిచేసే సంస్థలు, పర్యావరణ సంస్థలతో కలిసి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరించాలని సూచించారు. ప్రపంచంలోని అనేక దేశాలు అంతరిక్ష రంగంలో భారీ పెట్టుబడులు పెట్టలేని పరిస్థితిని భారత్ అవకాశంగా మలుచుకోవాలని మోదీ అన్నారు. ఈ రంగంలో భారత్ ఒక ‘అయస్కాంతం’లా మారి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాలని పేర్కొన్నారు.
అలాగే పాఠశాల విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌తో కలిసి పనిచేయాలని స్పేస్ అంకుర సంస్థలకు సూచించారు. భవిష్యత్ తరాలను అంతరిక్ష రంగం వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















