తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మరోసారి విశ్వ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక లూమియర్ మ్యూజియంలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఈ సందర్భంగా లూమియర్ మ్యూజియంతో పాటు ‘ఈగ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలు ప్రదర్శించిన స్క్రీనింగ్ రూమ్‌ను రాజమౌళి సందర్శించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమో స్వయంగా ఆయనను ఆహ్వానించి సత్కరించారు.
తర్వాత ఆయనకు ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. మార్టిన్ స్కోర్సెసీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల పేర్లు ఉన్న ‘ఫిల్మ్ మేకర్స్ వాల్’ వద్దకు తీసుకెళ్లి, ఎర్రటి వస్త్రంతో కప్పి ఉన్న ఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడ ప్రపంచ సినీ దిగ్గజాల సరసన ఎస్‌ఎస్ రాజమౌళి పేరు చోటు దక్కించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఘనతతో భావోద్వేగానికి గురైన రాజమౌళి, ఇది తన జీవితంలో మరచిపోలేని క్షణమని తెలిపారు. సినిమాను కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం, సినిమా చరిత్రలో అత్యంత పవిత్ర స్థలంగా భావించబడుతుంది. అలాంటి చోట భారతీయ దర్శకుడి పేరు నిలవడం దేశ సినిమా పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















