ఇంటర్నెట్ డెస్క్: రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇరుముడి’. అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.
‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి బంగారు పల్లకి’ పాటలో రామ్‌చరణ్ అయ్యప్ప మాలధారణలో కనిపిస్తారని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. దీంతో మెగా అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. అయితే ఈ ప్రచారంపై రామ్‌చరణ్ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని అభిమానులు, నెటిజన్లను కోరింది.
ఇటీవల ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలోని అయ్యప్ప పాట **‘మల్లెపూల పల్లకి’**ని విడుదల చేశారు. ఈ పాట గురించి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. ఇందులో అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందని చెప్పడంతో రామ్‌చరణ్ కనిపించనున్నారనే ప్రచారం మొదలైంది. అయితే తాజాగా హీరో టీమ్ ఇచ్చిన క్లారిటీతో ఆ వార్తలకు తెరపడింది.
అయ్యప్ప దీక్ష తీసుకున్న 41 రోజుల సమయంలో ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ కథ సాగుతుందని దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటికే వెల్లడించారు. సాధారణంగా వ్యసనాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి అయ్యప్ప దీక్ష తీసుకుంటే.. 41 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అక్కడి నుంచే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుందని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. ఆధ్యాత్మికత, భావోద్వేగాలు, కుటుంబ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















