భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని కనకగిరిగుట్టలపై కొలువైన హస్తాల వీరన్న విగ్రహం 800 సంవత్సరాల నాటిదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ వెల్లడించారు. ఇటీవల ఆయన ఈ గుట్టలను సందర్శించి విగ్రహంపై పరిశీలన జరిపారు.
ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శిల్పశాస్త్రం ప్రకారం ఇది అత్యంత అరుదైన విగ్రహమని, తెలంగాణలో ఇలాంటి శిల్పం మరెక్కడా కనిపించదని తెలిపారు. శిల్పకళా నైపుణ్యం, చెక్కిన విధానం ప్రత్యేకతను సూచిస్తుందని పేర్కొన్నారు.
గుట్టలపై ఉన్న వీరభద్రస్వామికి క్షేత్రపాలకుడిగా రక్షణగా నిలిచేలా ఈ హస్తాల వీరన్న విగ్రహాన్ని చెక్కినట్లు ఆయన వివరించారు. ఆ కాలంలోని భక్తి, శిల్ప సంప్రదాయాలకు ఇది నిదర్శనమని చెప్పారు.
ఈ విగ్రహం చారిత్రకంగా, పురావస్తు పరంగా అత్యంత విలువైనదని, దీనిపై మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















