ఇటీవల ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 30 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై కంపెనీ తాజాగా స్పందిస్తూ వాటిని పూర్తిగా అసత్య ప్రచారంగా కొట్టిపారేసింది.
సోమవారం స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో టెక్ మహీంద్రా స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో కంపెనీ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు తమ దృష్టికి వచ్చాయని, దీనిపై పలువురు తమను సంప్రదిస్తున్నారని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు తమ వద్ద లేవని సంస్థ పేర్కొంది. లేఆఫ్‌ల గురించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఆధారంలేని ఊహాగానాలు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది.
ఇటీవల టెక్ మహీంద్రా మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఏజెంటిక్ ఏఐ ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి పనిచేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో విస్తరించాయి. కృత్రిమ మేధ (AI) అభివృద్ధి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ వార్తలు ఐటీ రంగంలో ఆందోళనలు కలిగించాయి.
అయితే కంపెనీ మాత్రం ఉద్యోగుల తొలగింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంగా తెలిపింది. ప్రస్తుతం టెక్ మహీంద్రాలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో వెల్లడైంది. గత త్రైమాసికంలో కూడా ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదని సంస్థ మేనేజ్‌మెంట్ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















