శ్రీలంకపై టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కొలంబో టెస్టుకు ముందు తన లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు.
గాలె టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే అతడి ఇన్నింగ్స్ ముగిసింది. అంతేకాకుండా టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 11 సార్లు ఎడమచేతి స్పిన్నర్ల బౌలింగ్‌లో గిల్ ఔటయ్యాడు. దీంతో కొలంబోలో మరోసారి అదే తరహా బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నెట్స్‌లో ప్రత్యేకంగా సాధన చేశాడు.
గిల్ ప్రాక్టీస్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌తో పాటు శ్రీలంకకు చెందిన యువ బౌలర్లను కూడా ఎదుర్కొన్నాడు. స్పిన్‌ను ముందుగానే అంచనా వేసి ఆడటం, క్రీజులో ఎక్కువసేపు నిలబడటం వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటంతో ఈ సాధనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదిలా ఉంటే ప్రాక్టీస్ సెషన్‌కు కుల్‌దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ హాజరు కాలేదు. గిల్, రిషభ్ పంత్‌కు సారాంశ్ జైన్ బౌలింగ్ చేశాడు. దీంతో రెండో టెస్టులో కుల్‌దీప్ స్థానంలో సారాంశ్ జైన్‌కు అవకాశం దక్కవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ధ్రువ్ జురెల్ కూడా కాస్త ఆలస్యంగా సాధనకు చేరుకున్నాడు.
మరోవైపు టీమ్‌ఇండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి శ్రీలంకలోని భారత హై కమిషనర్ సంతోష్ ఆతిథ్యం ఇచ్చారు. కొలంబోలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. రెండో టెస్టుకు ముందు ఈ భేటీ తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని బీసీసీఐ పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















