ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కొనసాగుతున్న వివాదంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టులో హాజరై వాదనలు వినిపించడం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాస్వామ్యానికి, ఓటర్ల హక్కులకు సంబంధించిన అంశమని భావించినందువల్లే తాను స్వయంగా కోర్టు ముందుకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఎన్నికల సంఘానికి ఆరుసార్లు లేఖలు రాసినా సరైన స్పందన రాలేదని తెలిపారు. సమస్యలపై ఫిర్యాదులు చేసినప్పటికీ న్యాయం జరగలేదని, చివరకు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు. ఇది రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం కాదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు చేసిన ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు.
సర్ ప్రక్రియను ఏకపక్షంగా అమలు చేస్తున్నారని, ఇందులో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాము ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో కూడా భేటీ అయినప్పటికీ, అక్కడి నుంచి న్యాయం జరగకపోవడంతో నిరాశతో వాకౌట్ చేసిన ఘటనను మమతా బెనర్జీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
విచారణ సందర్భంగా స్వయంగా వాదనలు వినిపించేందుకు కొద్ది సమయం ఇవ్వాలని ఆమె కోరగా, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ 15 నిమిషాల అవకాశం ఇచ్చారు. ఆమె వాదనల్లో ప్రాథమికంగా వాస్తవం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా ఇస్తూ, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయడంతో, సర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఈ అంశం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















