అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి స్మగ్లర్ పరారైన ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. చింతపల్లి మండలం అన్నవరం ప్రాంతంలో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నిందితులు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోవడానికి ప్రయత్నించగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్సై గాల్లోకి కాల్పులు జరిపి వారిని పట్టుకున్నారు. వారి నుంచి 209 కిలోల గంజాయి, ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
గురువారం నిందితులను పాడేరు నుంచి ఎలమంచిలి కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాజువాకకు చెందిన స్మగ్లర్ ఇమ్రాన్ ఖాన్ సబ్బవరం సమీపంలో కాలకృత్యాలకు వెళ్లొస్తానని చెప్పి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించి నిందితుడి కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని కదలికలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే అతడిని పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















