రాష్ట్రంలో పాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్)లో డేటా ఆధారిత నిర్ణయాలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డేటా ఆధారిత నిర్ణయాల విధానంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రియల్‌టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరును సమీక్షించిన చంద్రబాబు.. ఆర్‌టీజీఎస్ ద్వారా పాలన మరింత వేగవంతంగా, సమర్థవంతంగా ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ నిర్ణయాల రూపకల్పనలో డేటా వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య డేటా సమన్వయాన్ని మెరుగుపరచడం, సమాచారాన్ని ఒకే వేదికపై సమర్థంగా ఉపయోగించుకోవడంపై అధికారులతో సీఎం చర్చించారు. శాఖల వారీగా డేటా నిర్వహణ, సమన్వయం, విశ్లేషణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు ఐటీ, ఆర్‌టీజీఎస్, వ్యవసాయం, మున్సిపల్, సంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















