అత్యుత్తమ నైపుణ్యం, కనీస విద్యార్హతలు ఉంటే చాలు.. తెలంగాణ యువతకు విదేశాల్లో బ్లూకాలర్ ఉద్యోగాల అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందిన దేశాల్లో నైపుణ్యం కలిగిన భారతీయులకు భారీ డిమాండ్ ఉండటంతో ఈ అవకాశాలను తెలంగాణ యువతకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆయా దేశాల స్థానిక భాషపై పట్టు సాధిస్తే మెరుగైన వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ద్వారా ఏటా సుమారు 5 వేల మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీర్ఘకాలంలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించి 2047 నాటికి 2 లక్షల మందికి విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విదేశాలకు వెళ్లే అభ్యర్థులకు అవసరమైన శిక్షణతో పాటు ఉపకార వేతనాల రూపంలో ఆర్థిక సహాయం అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది.
టామ్‌కామ్ ద్వారా గత ఏడేళ్లలో 14 వేల మందికిపైగా విదేశాల్లో ఉపాధి పొందారు. ఇందులో గత రెండున్నరేళ్లలోనే సుమారు 8 వేల మంది ఉద్యోగాలు సాధించడం విదేశీ ఉపాధిపై తెలంగాణ యువతలో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.
యూరప్, జపాన్, యూకే, యూఏఈ తదితర దేశాలతో టామ్‌కామ్ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయా దేశాల్లో ఆరోగ్యం, లాజిస్టిక్స్, నిర్మాణం, తయారీ, ఆతిథ్యం, టెక్స్‌టైల్ రంగాల్లో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు నైపుణ్య శిక్షణతో పాటు భాషా ప్రావీణ్యాన్ని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
నర్సింగ్ విద్యను పూర్తి చేసి, సంబంధిత రంగంలో అనుభవంతో పాటు స్థానిక భాషపై పట్టు ఉన్న వారికి పలు దేశాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టామ్‌కామ్ ఆధ్వర్యంలో యూరోపియన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జర్మనీలో ఫిజియోథెరపిస్టు ఉద్యోగాలకు ఎంపికైన తెలంగాణ యువతకు నెలకు సుమారు రూ.3.2 లక్షల వరకు వేతన ఆఫర్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 120 ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు, 100 ట్రక్ డ్రైవర్ పోస్టులు అందుబాటులో ఉన్నట్లు టామ్‌కామ్ వెల్లడించింది.
ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగంలో సుమారు 1,200 ఉద్యోగ ఖాళీలు ఉండగా.. జపాన్‌లో 1,500 నర్సింగ్ ఉద్యోగాలకు అవకాశాలున్నాయి. రష్యా, ఆసియా పసిఫిక్ ప్రాంతం, అమెరికాలోనూ లాజిస్టిక్స్, నిర్మాణం, టెక్స్‌టైల్, తయారీ రంగాల్లో అవకాశాలను గుర్తిస్తున్నారు.
విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడంతోనే తమ బాధ్యత పూర్తయిందని భావించకుండా.. అక్కడ ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేందుకు టామ్‌కామ్ ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగుల భద్రత, సమస్యల పరిష్కారం, అవసరమైన సహాయం వంటి అంశాల్లో ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగాల కోసం టామ్‌కామ్ వద్ద ఇప్పటికే సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని దేశాలు, రంగాల్లో అవకాశాలను గుర్తించి తెలంగాణ యువత
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















