పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరే అన్ని దేశాల వాణిజ్య నౌకలను Strait of Hormuz వద్ద అడ్డుకుంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది.అయితే, ఇరానేతర పోర్టులకు వెళ్లే నౌకలపై అంతగా ఆటంకాలు కలిగించబోమని కూడా అమెరికా స్పష్టం చేసింది. అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు ‘ఛానల్ 16’ ద్వారా అమెరికా దళాలతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని సూచించింది.
ఇరాన్ తీవ్ర ప్రతిస్పందన
అమెరికా ప్రకటనలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్రంగా స్పందించింది. తమ సముద్ర ప్రాంతంలో ఎవరైనా దూకుడుగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.హర్మూజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రు చర్యలు జరిగితే “జలసంధిలో సుడిగుండంలో ముంచేస్తాం” అని హెచ్చరించింది.
చమురు ధరలు భారీగా పెరుగుదల
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 11 శాతం పెరిగి బ్యారెల్‌కు సుమారు 105 డాలర్లకు చేరాయి.
- WTI క్రూడ్: 104.2 డాలర్లు
- బ్రెంట్ క్రూడ్: 101 డాలర్లు
Strait of Hormuz ద్వారా జరుగుతున్న చమురు రవాణా అంతరాయం కారణంగా సరఫరా భయాలు పెరిగాయి.
ఆసియా మార్కెట్లపై ప్రభావం
ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి సూచీలు దాదాపు 1% వరకు పడిపోయాయి
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















