నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ పైఅంతస్తులో ఉన్న మహంకాళి ఆలయంలోని వెండి కిరీటం, హుండీ నగదును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
దుండగులు మహంకాళి ఆలయ గేటును పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారని సమాచారం. అనంతరం హుండీలోని నగదును తీసుకుని, హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసి పరారైనట్లు తెలుస్తోంది.
మంగళవారం తెల్లవారుజామున పూజలకు వచ్చిన అర్చకులు ఆలయంలో జరిగిన చోరీని గుర్తించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.
కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆలయ పరిసరాల్లో ఆధారాలు సేకరిస్తున్నాయి. చోరీకి గురైన వెండి కిరీటం సుమారు కేజీన్నర బరువు ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
చోరీ ఘటన నేపథ్యంలో నేడు జరగాల్సిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు.
స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ముథోల్ ఎమ్మెల్యే రామారావు, భైంసా సబ్ కలెక్టర్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















