శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు పొలంలోని నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు.
నారనాగేపల్లి గ్రామానికి చెందిన జవాన్ అజయ్‌రెడ్డి, కల్పన దంపతుల కుమారులు దరహాస్‌రెడ్డి (13), హర్షిత్‌రెడ్డి (10) అనంతపురంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. తండ్రి అజయ్‌రెడ్డి ప్రస్తుతం మణిపూర్‌లో సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల కోసం పిల్లలు స్వగ్రామానికి వచ్చారు.
అలాగే రాప్తాడు మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి, శ్రీదేవి దంపతుల కుమారుడు సృజన్‌రెడ్డి (13) కూడా అదే ప్రాంతంలో ఉన్నాడు. ఆరేళ్ల క్రితం తండ్రి మరణించడంతో సృజన్ తన తల్లితో కలిసి నారనాగేపల్లిలోనే నివసిస్తున్నాడు.
బుధవారం మధ్యాహ్నం ముగ్గురు బాలురు నేరేడు పండ్లు కోసేందుకు పొలాల్లోకి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో నీటి కుంట వద్ద జారిపడి అందులో పడిపోయినట్లు సమాచారం. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















