పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేస్తూ పార్టీతో తన బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. టీఎంసీలో పెరుగుతున్న అంతర్గత విభేదాల మధ్య ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మమతా బెనర్జీకి రాసిన లేఖలో సుఖేందు శేఖర్ రాయ్ పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో అవినీతి పెరిగిపోయిందని, మహిళల భద్రత, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి, శాంతిభద్రతల వంటి కీలక రంగాల్లో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు.
అదే సమయంలో భారతీయ జనతా పార్టీ పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇప్పటికే టీఎంసీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో సుఖేందు రాజీనామా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరో రాజ్యసభ సభ్యురాలు కోయల్ మల్లిక్ కూడా రాజీనామా చేసే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే పలువురు టీఎంసీ ఎంపీలు ఇతర రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. టీఎంసీకి ఇది కేవలం ఒక రాజీనామా మాత్రమేనా? లేక పెద్ద రాజకీయ మార్పులకు నాంది కాబోతుందా? అన్నది ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















