పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చి పొగాకుకు గరిష్ఠ ధర లభించేలా చూడాలని సూచించారు.
శుక్రవారం పొగాకు కొనుగోళ్ల పురోగతి, రైతులకు లభిస్తున్న ధరలపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్‌కుమార్, ఈడీ విశ్వశ్రీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్‌లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పొగాకు కొనుగోళ్ల పరిస్థితి, మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలు, రైతులకు అందుతున్న ధరలపై అధికారులతో సమీక్షించారు. గత నాలుగు రోజులుగా పొగాకు కొనుగోళ్లు ఊపందుకున్నాయని మంత్రి తెలిపారు. కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
పొగాకు నాణ్యత ఆధారంగా రైతులకు సరైన ధరలు లభించేలా కొనుగోలు సంస్థలు వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
మార్కెట్‌లో ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రైతుల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగించాలని సూచించారు.
పొగాకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















