ఖతార్ బహుమతిగా ఇచ్చిన కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డలాస్‌లో జరగనున్న రిపబ్లికన్ పార్టీ మిడ్‌టర్మ్ సమావేశానికి హాజరయ్యేందుకు బయల్దేరే ముందు విమానంలో ఎమర్జెన్సీ స్లైడ్ అకస్మాత్తుగా తెరుచుకుంది. దీంతో ట్రంప్ ప్రయాణం కొద్దిసేపు ఆలస్యమైంది.
వైట్‌హౌస్ నుంచి ‘మెరైన్ వన్’ హెలికాప్టర్‌లో జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్న ట్రంప్.. ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన విమానం ఎక్కడానికి కొన్ని నిమిషాల ముందు విమానం ముందు భాగంలోని అత్యవసర స్లైడ్ అనుకోకుండా తెరుచుకుంది. దీంతో అధికారులు పరిస్థితిని పరిశీలించే వరకు ట్రంప్ సుమారు 15 నిమిషాల పాటు మెరైన్ వన్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగినట్లు సమాచారం. అధికారులు పరిశీలించిన అనంతరం విమానం సురక్షితంగా ఉందని నిర్ధారించడంతో ట్రంప్ అదే ఎయిర్‌ఫోర్స్ వన్‌లో డలాస్‌కు బయల్దేరారు. అక్కడ ఆయన విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
విమానం సురక్షితమేనా అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా.. “సురక్షితం కాకపోతే నేను ఎక్కేవాడినే కాదు” అంటూ ఆయన సమాధానమిచ్చారు. బోయింగ్ 747-8 తరహా విమానాల్లో సాధారణంగా 12 అత్యవసర స్లైడ్‌లు ఉంటాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















