వేలాది మంది అమెరికన్లు, పలు సంస్థలకు సంబంధించిన సున్నితమైన డేటాను మూడు భారత కంపెనీలు అక్రమంగా సేకరించి, హ్యాకింగ్‌కు పాల్పడ్డాయని అమెరికా సెనేటర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డెమోక్రటిక్ సెనేటర్లు రాన్ వైడెన్, షెల్డన్ వైట్‌హౌస్, రిపబ్లికన్ సెనేటర్ ప్యాట్ హారిగన్.. అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్‌కు లేఖ రాశారు.
సన్‌కిస్డ్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్, బెల్‌ట్రాక్స్ లిమిటెడ్, సైబర్‌రూట్ లిమిటెడ్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా సాఫ్ట్‌వేర్, క్లౌడ్ మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ టూల్స్‌ను ఈ సంస్థలు వినియోగించకుండా ఆంక్షలు విధించాలని, అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని కోరారు.
ఈ మూడు కంపెనీలు 15 ఏళ్లకు పైగా సైబర్ నిఘా, డేటా చోరీ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉందని సెనేటర్లు లేఖలో పేర్కొన్నారు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఔషధ కంపెనీలు, ప్రముఖ న్యాయ సంస్థలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని పెద్దఎత్తున హ్యాకింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపించారు.
1000 మందికిపైగా న్యాయవాదులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సెనేటర్లు వెల్లడించారు. అంతేకాకుండా ఖతార్ ప్రపంచకప్ నిర్వహణ ప్రయత్నాలను వ్యతిరేకించిన వ్యక్తులు, అమెరికా ప్రతినిధుల సభలో మాజీ సీనియర్ నేత కుటుంబ సభ్యులను సైతం లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
తమ కార్యకలాపాలపై వెలువడుతున్న వార్తలను అడ్డుకునేందుకు విదేశీ న్యాయస్థానాలను ఉపయోగించుకున్నారనే ఆరోపణలను కూడా సెనేటర్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మూడు కంపెనీలపై సమగ్ర దర్యాప్తు జరిపి, అమెరికా సాంకేతిక వనరులు వారికి అందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాణిజ్యశాఖను కోరారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత కంపెనీల నుంచి వచ్చే అధికారిక స్పందన కీలకంగా మారనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















