ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ యుద్ధం కొనసాగవచ్చని, ఆ తర్వాతే పరిస్థితులు మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్లకు చేరిన నేపథ్యంలో.. యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమెరికా బలగాలు హర్మూజ్ ప్రాంతంలో తమ కార్యకలాపాలను ఉద్ధృతం చేస్తున్నాయని, ఇరాన్ ఎక్కువకాలం ఈ దాడులను ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త నిబంధనలను ప్రకటించింది. అమెరికా మద్దతుతో అసురక్షిత మార్గంలో ప్రయాణించే నౌకలను ఆంక్షల జాబితాలో చేర్చుతామని హెచ్చరించింది. ఇటీవల అమెరికా నౌకలు, ఎనిమిది ట్యాంకర్లపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అమెరికా కూడా టెహ్రాన్‌కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ప్రతిదాడికి దిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఏ-10 థండర్‌బోల్ట్ విమానంతో పాటు ఎనిమిది ఎఫ్-15 యుద్ధ విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా 30 పాట్రియాట్ క్షిపణులను మోహరించినట్లు తెలుస్తోంది.
జోర్డాన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్ నుంచి పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణలో ఈ స్థావరం వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడటంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడంతో ముడిచమురు ధరలు 100 డాలర్ల మార్క్‌ను దాటాయి.
ఇరాన్‌తో చర్చలకు తాము ఆసక్తి చూపడం లేదని ట్రంప్ స్పష్టం చేసినప్పటికీ.. భవిష్యత్తులో ఒప్పందానికి అవకాశం మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేదు. దీంతో యుద్ధం ఎటువైపు దారితీస్తుందనే దానిపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















