దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. రజత్ పటిదార్ నాయకత్వంలోని సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు సోమవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ కూడా సరిగ్గా 266 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమమయ్యాయి.
ఈస్ట్ జోన్ ఓపెనర్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటాడు. కేవలం 81 బంతుల్లో 92 పరుగులు చేసి సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్.. సెంట్రల్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా రాణించాడు. అతడు 106 బంతుల్లో 69 పరుగులు చేశాడు. అతడి స్కోరులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. అయితే కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం 16 పరుగులకే పరిమితమయ్యాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈస్ట్ జోన్ 266 పరుగులకే ఆలౌటైంది.సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబె నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ పాండే, యశ్ ఠాకూర్ చెరో మూడు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన 15 ఏళ్ల వైభవ్.. దులీప్ ట్రోఫీలో పిన్న వయసులో అర్ధశతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
15 సంవత్సరాల 157 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించి.. 57 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు. ఇంతకుముందు ఈ రికార్డు లక్ష్మణ్ సింగ్ పేరిట ఉండేది. ఆయన 1969లో 16 సంవత్సరాల 23 రోజుల వయసులో దులీప్ ట్రోఫీలో అర్ధశతకం సాధించాడు.
2005లో పీయూష్ చావ్లా కూడా 16 సంవత్సరాల 307 రోజుల వయసులో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తాజాగా వైభవ్ సూర్యవంశీ ఈ ఇద్దరినీ అధిగమించి దులీప్ ట్రోఫీ చరిత్రలో పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
సెంచరీకి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో ఆగిపోయినా.. తన ధనాధన్ బ్యాటింగ్‌తో వైభవ్ మరోసారి క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















