Government of Andhra Pradesh విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం అధికారికంగా వివరణ ఇచ్చింది.
Vijayawada International Airportలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.611.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించేందుకు Airports Authority of India మరియు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నాయని పేర్కొంది.
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్టు మాత్రమేనని, గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామ సమీపంలో సుమారు 4,618 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపింది.కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చినా గన్నవరం విమానాశ్రయం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసిన ప్రభుత్వం.. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















