మీరు తెలిపిన వివరాలను బట్టి మీ అమ్మగారు ప్లాంటార్ ఫేషియైటిస్ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తోంది. మన పాదం అడుగున మడమ దగ్గరి నుంచి వేళ్లు మొదలయ్యే చోటు వరకూ దృఢమైన, పోచలతో కూడిన పొర ఉంటుంది. పాదాల్లోని ఎముకలు ఒకదగ్గర కలిసి ఉండటానికి, పాదం మధ్యలో ఒంపు ఏర్పడటానికి తోడ్పడే ఇది మందపాటి రబ్బరులా సాగుతుంటుంది. వయసు మీద పడటం వల్లనో, అతిగా వాడటం వల్లనో ఇది దెబ్బతిని, ఉబ్బొచ్చు. దీన్నే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. ఇందులో నడుస్తున్నప్పుడు నొప్పి పుడుతుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేచాక పాదం కింద పెట్టగానే తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు తుంటారు. కొందరికి ఎక్కువసేపు కూర్చొని లేచిన తర్వాత నడుస్తున్నప్పుడూ నొప్పి పుట్టొచ్చు. దీనికి చాలావరకూ ఉపశమన చికిత్సలే చేస్తారు. నొప్పి మాత్రలతో హాయి కలుగుతుంది. అలాగే నిపుణుల సమక్షంలో చేసే ప్రత్యేక వ్యాయామాలూ (ఫిజియోథెరపీ) ఉపయోగపడతాయి. గోరువెచ్చటి, కరిగిన లక్కలో పాదాలను ఉంచి చేసే చికిత్స (వ్యాక్స్ బాత్ ఫిజియోథెరపీ) నొప్పి తగ్గటానికి తోడ్పడుతుంది. ఇంట్లో కొన్ని చిట్కాలతోనూ ఉపశమనం పొందొచ్చు. బకెట్‌లో గోరువెచ్చటి నీరు పోసి, అందులో పది నిమిషాల సేపు పాదాలను పెట్టాలి. నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తే ఇంకా మంచిది. మడమను నేలకు ఆనించి వేళ్ల వైపు నుంచి పాదాన్ని వీలైనంత పైకి లేపాలి. కాసేపు అలాగే ఉంచి, కిందికి దించాలి. ఓ పది పదిహేను సార్లు ఇలా చేస్తుంటే ప్లాంటార్ ఫేషియా బిగువు తగ్గుతుంది. మెత్తటి సోల్‌తో కూడినవి, పాదం మధ్యలో ఒంపునకు దన్నుగా నిలిచే చెప్పులు ధరించాలి. ఎక్కువగా మెట్లు ఎక్కనీయొద్దు. గట్టి నేల మీద నడవనీయొద్దు. మాత్రలు, వ్యాయామాలతో నొప్పి తగ్గకపోతే ప్లాంటార్ ఫేషియాలోకి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఒకసారి రక్తంలో గ్లూకోజు, యూరిక్ యాసిడ్ మోతాదులనూ పరీక్షించుకోవటం మంచిది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















