ఎండాకాలంలో అధిక వేడి మూలంగా ఒంట్లో నీరంతా చెమట రూపంలో ఆవిరి అవుతూ వస్తుంటుంది. ఇదిలాగే కొనసాగుతూ వస్తుంటే చివరికి ఒంట్లో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం దెబ్బతింటుంది. అప్పుడు చెమట పట్టటమూ ఆగిపోతుంది. చర్మం పొడి బారుతుంది. శరీర ఉష్ణోగ్రత అంతకంతకూ వేగంగా పెరిగిపోయి, తీవ్ర జ్వరం ముంచుకొస్తుంది. జ్వరం 105 డిగ్రీల ఫారన్‌హీట్‌ను దాటుతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గటం వల్ల రక్తపోటూ పడిపోతుంది. దీన్నే వడదెబ్బ, ఎండదెబ్బ అంటారు.
- కొందరికి ఎండలోకి వెళ్లకపోయినా వడదెబ్బ తగలొచ్చు. ఇంట్లో పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉన్నా, ఫ్యాక్టరీల్లో ఫర్నేస్‌ల వంటి విభాగాల్లో పనిచేసినా, ఒకే గదిలో ఎక్కువమంది గుమిగూడే చోట ఉన్నా వడదెబ్బ తగలొచ్చు.
- చిన్న పిల్లలకు, వృద్ధులకు దాహం వేస్తున్న విషయం అంతగా తెలియదు. దీంతో తగినంత నీరు తీసుకోరు. తెలియకుండానే ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. పైగా పిల్లల్లో, వృద్ధుల్లో చెమటను ఉత్పత్తి చేసే స్వేదగ్రంథులు తక్కువగా ఉంటాయి. దీంతో చెమట సరిగా పట్టదు. అందువల్ల వీరికి వడదెబ్బ ముప్పు ఎక్కువ.
- కొన్నిరకాల చర్మ సమస్యలు గలవారికి స్వేదగ్రంథులు అంతగా ఉండవు, ఉన్నా పనిచేయవు. ఇలాంటివారికీ వడదెబ్బ ముప్పు ఎక్కువ.
- కొన్నిరకాల మందులతోనూ వడదెబ్బ ముప్పు పెరగొచ్చు. మానసిక సమస్యలకు వేసుకునే కొన్ని మందులతో స్వేదగ్రంథులు పనిచేయవు. నీళ్లు బాగానే తాగినా స్వేదగ్రంథులు పనిచేయక పోవటం వల్ల చెమట పట్టదు. దీంతో వడదెబ్బ బారినపడుతుంటారు.
- గుండెజబ్బులు, కిడ్నీజబ్బులు, అధిక రక్తపోటు బాధితులు మూత్రం ఎక్కువగా వచ్చే మందులు వేసుకుంటుంటారు. మూత్రం ఎక్కువగా రావటం వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది. దీంతో చర్మానికి తగినంత రక్తం అందక, చెమట సరిగా పట్టదు. ఇదీ వడదెబ్బ ముప్పు పెరిగేలా చేస్తుంది.
- బిగుతైన, నైలాన్ దుస్తుల వంటివి ధరించినపుడు ఒంటికి అంతగా గాలి తగలదు. చెమట గాలికి ఆవిరైనప్పుడే శరీరం చల్లబడు తుంది. గాలి సరిగా తగలకపోతే ఒంట్లో ఉష్ణోగ్రత నియంత్రణలోకి రాదు. ఇలా వేడి ఎక్కువగా ఉంటున్నకొద్దీ కొన్నిసార్లు చెమట పట్టటమూ ఆగిపోతుంది. ఇదీ వడదెబ్బకు దారితీయొచ్చు.
- గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చెమట బాగానే పోస్తుంది గానీ ఆవిరి కాదు. దీంతో ఒళ్లు చల్లబడదు. అందువల్ల ఇలాంటి ప్రాంతాల్లో ఎండకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా వడదెబ్బ తగిలే ప్రమాదముంది. నీడ పట్టున ఉన్నా వడదెబ్బ తగిలే అవకాశముంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















