ఒకే వంటను కుటుంబ సభ్యులంతా కలిసి తిన్నా.. ఒక్కొక్కరికి ఒక్కోలా కారం అనిపించడం సహజమే. దీనికి కారణం వారి నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ సంఖ్య, రుచి పట్ల స్పందించే విధానం.
మన నాలుకపై వేల సంఖ్యలో టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఆహారంలోని రసాయనాలు లాలాజలంతో కలిసినప్పుడు అవి రుచిని గుర్తించడంలో సహాయపడతాయి. అయితే మన నాలుకకు తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు వంటి ప్రాథమిక రుచులు తెలుస్తాయి కానీ.. కారం మాత్రం ప్రత్యేకమైన రుచి కాదు.
మిరపకాయల్లో ఉండే కాప్సాసిన్ అనే రసాయనం నాలుకపై వేడిని గుర్తించే నరాలను ఉత్తేజపరుస్తుంది. దీంతో నోట్లో మంటగా అనిపించి.. మెదడుకు నొప్పి సంకేతాలు వెళ్తాయి. ఈ స్పందననే మనం ‘కారం’గా భావిస్తాం. దీనికి ప్రతిస్పందనగా మెదడు ఎండోర్ఫిన్లను విడుదల చేయడంతో కొందరికి కారం తిన్న తర్వాత మంటతో పాటు హాయిగా కూడా అనిపిస్తుంది.
టేస్ట్ బడ్స్ ఎక్కువగా ఉన్నవారికి చేదు, ఉప్పు, కారం వంటి రుచులు మరింత ఘాటుగా అనిపించవచ్చు. వీరిని ‘సూపర్ టేస్టర్లు’ అంటారు. మరోవైపు రుచులకు తక్కువ సున్నితత్వం ఉన్నవారికి అదే ఆహారం అంతగా ఘాటుగా అనిపించకపోవచ్చు. వీరిని సాధారణంగా ‘నాన్ టేస్టర్లు’ అని పిలుస్తారు.
చిన్నపిల్లల్లో రుచి గ్రహించే సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో చేదు, ఘాటు రుచులను వారు ఎక్కువగా ఇష్టపడకపోవచ్చు. అంతేకాదు.. మనం గర్భంలో ఉన్నప్పుడే కొన్ని రుచులను అనుభవించడం ప్రారంభిస్తామని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అందుకే ఒకే వంటకం తిన్నా.. ఎవరికెంత కారం అనిపిస్తుందన్నది వారి రుచి గ్రహించే సామర్థ్యం, ఆహారపు అలవాట్లు, మిరపకాయలోని కాప్సాసిన్ స్థాయి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















