మన శరీరంలో కీలక పాత్ర పోషించే కాలేయం (Liver) కేవలం నిరంతరం పనిచేసే అవయవం మాత్రమే కాదు… దీనికీ తనదైన “జీవగడియారం” ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపిన ప్రకారం, కాలేయం రోజంతా ఒకే విధంగా ప్రోటీన్లు విడుదల చేయదు. ఇది 24 గంటల చక్రంలో, నిర్దిష్ట సమయాలకు అనుగుణంగా రక్తంలోకి ప్రోటీన్లను విడుదల చేస్తుంది.
ఎందుకు ముఖ్యమది?
రక్తంలో ప్రసరించే అనేక ప్రోటీన్ల ఉత్పత్తి, రవాణా కాలేయం ద్వారా జరుగుతుంది.
జీవక్రియ (Metabolism) సక్రమంగా సాగటానికి
శరీర శక్తి సమతుల్యం ఉండటానికి
వాపు నియంత్రణకు
హార్మోన్ సమతుల్యానికి కీలకం
అయితే ఈ ప్రక్రియలు జీవగడియారం (Circadian Rhythm)కు అనుగుణంగా సాగుతాయని పరిశోధకులు గుర్తించారు.
షిఫ్ట్ ఉద్యోగాలు… అనియంత్రిత భోజనం ప్రభావం
రోజువారీ పనులు అస్తవ్యస్తమైతే — ఉదాహరణకు రాత్రి పూట షిఫ్ట్ ఉద్యోగాలు, వేళాపాళా లేని భోజనం, గంటకోసారి తినటం లేదా పోషక పానీయాలు తీసుకోవటం — కాలేయ లయ దెబ్బతింటుంది. దీని వల్ల ఊబకాయం,మధుమేహం, దీర్ఘకాలిక వాపు సమస్యలు, వంటి జబ్బులకు అవకాశం పెరుగుతుందని పరిశోధన చెబుతోంది.
వేళకు భోజనం ఎందుకు అవసరం?
వేళకు భోజనం చేసే వారిలో కాలేయ లయ సక్రమంగా కొనసాగుతుందని, కానీ అసమయ భోజనం వల్ల ఈ చక్రం భంగమవుతుందని అధ్యయనం సూచిస్తోంది. అంటే శరీర ఆరోగ్యం కోసం కేవలం “ఏం తింటున్నాం” మాత్రమే కాదు… “ఎప్పుడు తింటున్నాం” కూడా అంతే ముఖ్యం.
భవిష్యత్ పరిశోధనలకు మార్గం
కాలేయ జీవగడియారం పై అవగాహన పెరిగితే పోషకాహారం, షిఫ్ట్ ఉద్యోగాల ఆరోగ్య ప్రభావం, జబ్బుల నివారణ వంటి అంశాల్లో కొత్త మార్గదర్శకాలు రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















