అమరావతి ఆర్టీజీఎస్ కేంద్రంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ చేరనున్నందున సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలు వంటి అవసరమైన సంస్థలకు గ్యాస్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో ఎలాంటి ఆందోళన లేకుండా సరఫరా వ్యవస్థను సజావుగా కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈకేవైసీ, ఓటీపీ విధానాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ డైవర్షన్‌కు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ కొరత పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఉపయోగించుకునే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని, ఇండక్షన్ స్టవ్స్ లభ్యతను పెంచాలని సూచించారు.
గ్యాస్ కంపెనీలు తాత్కాలికంగా ఉత్పత్తిని పెంచడం, సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడం అవసరమని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు, కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైపులైన్ల ద్వారా నేరుగా ప్రజలకు అందించే విధానంపై దృష్టి పెట్టాలని సూచించారు.అలాగే సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో గ్యాస్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని, సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు.మొత్తంగా రాష్ట్రంలో గ్యాస్ సరఫరా స్థితిగతులపై స్పష్టత ఇస్తూ, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















