భక్తుల సౌకర్యార్థం 2026 జులై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్ల నమోదు ఏప్రిల్ 18 ఉదయం 10 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది.సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్ల కోసం భక్తులు ఏప్రిల్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అనంతరం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారు ఏప్రిల్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపు పూర్తి చేస్తే టికెట్లు మంజూరవుతాయి.
ఇతర సేవల టికెట్ల విడుదల షెడ్యూల్
- ఏప్రిల్ 21 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు విడుదల
- అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా విడుదల
- ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల
- అదే రోజు 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు విడుదల
- మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల
- ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
- అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల
భక్తులు టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే వినియోగించాలని తితిదే అధికారులు సూచించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















