లోక్‌సభలో రాజ్యాంగ సవరణ నల్ల బిల్లును ఓడించడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఐక్యంగా నిలిచి జాతీయ విపత్తును అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజుగా అభివర్ణిస్తూ, పార్లమెంటులో ఏకమై పోరాడిన అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ తదితర నాయకులు ఐక్యతతో పోరాడారని వెల్లడించారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో భాజపా వైఖరిని సీఎం తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభ సీట్ల పెంపు పద్ధతి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని ఆయన మునుపటినుంచే అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు లేఖలు రాసి ఐక్యంగా నిలవాలని కోరారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, సీట్ల పెంపు వంటి వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ అంశంపై లేఖ రాసినట్లు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా చర్చ జరిపి, అన్ని రాష్ట్రాలు మరియు రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని, ప్రస్తుతం ఉన్న లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల రాజకీయ సాధికారత ప్రజాస్వామ్యానికి నైతిక అవసరమని తెలిపారు.జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచే విధానం సమాఖ్య వ్యవస్థలో అసమతౌల్యాన్ని పెంచుతుందని సీఎం హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ, అభివృద్ధి రంగాల్లో ముందుండి కూడా అన్యాయం ఎదుర్కొంటున్నాయని చెప్పారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ లాభం చేకూరుతుండగా, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అభివృద్ధికి తోడ్పడిన రాష్ట్రాలకు శిక్ష పడకూడదని, దేశ సమగ్రత, సమానత్వం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















