కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా బలహీన వర్గాలు) అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల తరహాలో వయోపరిమితి మినహాయింపులు లేదా అదనపు ప్రయత్నాల అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్ల ధర్మాసనం ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక బలహీనతను కుల ప్రాతిపదికన ఎదురయ్యే సామాజిక వివక్షతో పోల్చలేమని కోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు అనుభవించే సామాజిక వెనుకబాటుతనం జీవితాంతం ప్రభావం చూపుతుందని, అయితే ఆర్థిక పరిస్థితులు కాలక్రమంలో మారే అవకాశముందని అభిప్రాయపడింది.
వయోపరిమితి సడలింపులు, పరీక్ష ప్రయత్నాల సంఖ్యలో మినహాయింపులు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానంలో ఎలాంటి దురుద్దేశం లేదని కోర్టు స్పష్టం చేసింది. అది రాజ్యాంగ విరుద్ధమో, ఏకపక్ష నిర్ణయమో కాదని తేల్చిచెప్పింది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలతో సమానంగా తమకూ వయోపరిమితి, ప్రయత్నాల మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.సామాజిక వెనుకబాటుతనం మరియు ఆర్థిక బలహీనత ఒకేలా కావని, రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని కోర్టు అభిప్రాయపడింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















