రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126 శాతం పెంచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్, పెట్రోల్ కోసం తెలంగాణకు వస్తుండటం, వదంతుల కారణంగా బంకుల దగ్గర రద్దీ పెరిగిందని తెలిపారు. అవసరానికి మించి ఎవరూ పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరు రూ.150కి పెంచారు. దీంతో పెద్ద మొత్తంలో కొనే వ్యాపారులు.. లీటరు రూ.95కే దొరుకుతున్న సాధారణ బంకులకు వచ్చి డీజిల్ కొంటున్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతో సాధారణ ప్రజలు అవసరానికి మించి కొని దాచుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బంకుల్లో సరిపడా నిల్వలు ఉంచాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర చమురు కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.
సరఫరా వేగవంతానికి చర్యలు: ఇంధన సరఫరా వేగవంతానికి డీలర్ల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా 3,100 ట్యాంకర్లను రంగంలోకి దించారు. బంకుల్లో నిల్వలు అయిపోకముందే వాటికి ఇంధనం చేరేలా అధికారులు పర్యవేక్షణ పెంచారు. మూడు గంటలకోసారి బంకుల నుంచి నిల్వల వివరాలు తెప్పించుకోవడంతో పాటు, రోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లలో లారీల వినియోగానికి ఎలాంటి ఆటంకం కలగదు. భారీగా సరఫరా పెంచడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 27 నాటికి రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151 శాతం పెరిగి 7,348 లీటర్ల నుంచి 18,449 లీటర్లకు చేరింది. పెట్రోల్ పంపిణీ 95 శాతం పెరిగి 5,883 లీటర్ల నుంచి 11,490 లీటర్లకు చేరుకుంది. అంటే పెట్రోలు, డీజిలు కలిపి రోజువారీ పంపిణీ 13,231 లీటర్ల నుంచి 29,939 లీటర్ల (126 శాతం)కు పెరిగింది. హైదరాబాద్‌లో ఇంధన సరఫరాను 43 శాతం మేర పెంచారు. నగరంలో డీజిల్ నిల్వలను 46 శాతం (3,393 నుంచి 4,957 లీటర్లకు), పెట్రోల్ నిల్వలను 40 శాతం (3,908 నుంచి 5,466 లీటర్లకు) పెంచారు’’ అని మంత్రి వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















