నీట్ పరీక్షల్లో తరచూ ప్రశ్నపత్రాల లీక్‌లు జరుగుతుండటంతో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ మళ్లీ బలంగా వినిపిస్తోంది. జేఈఈ మెయిన్ తరహాలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తేనే లీక్‌లకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే నీట్ పరీక్షలో ఎక్కడైనా ప్రశ్నపత్రం లీకైతే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ సీట్లు తక్కువగా ఉండటం, పోటీ తీవ్రంగా ఉండటంతో ఒక్క మార్కు తేడా కూడా ర్యాంకుల్లో భారీ మార్పులకు కారణమవుతోంది.
2024లో నీట్ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరిరంగన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా నీట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సిఫార్సు చేసింది. పరీక్ష కేంద్రాల సామర్థ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ, చివరకు పరీక్షను మళ్లీ ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించారు. ఫలితంగా మరోసారి ప్రశ్నపత్రాల లీక్ వివాదం తలెత్తింది.కాళోజీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కె.రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ, ఎంబీబీఎస్ సీట్లకు ఉన్న భారీ డిమాండ్ కారణంగా అక్రమాలకు అవకాశం ఉంటోందన్నారు. అందుకే విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించాలంటే ఆన్‌లైన్ విధానం తప్పనిసరని అభిప్రాయపడ్డారు.
నీట్ జాతీయ కోఆర్డినేటర్ వి.కుమార్ మాట్లాడుతూ, ఆన్‌లైన్‌లో ఒకేసారి పరీక్ష నిర్వహించడం ఉత్తమమన్నారు. పలు షిఫ్ట్‌ల్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ విధానం అమలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 40 వేల మంది ఒకేసారి పరీక్ష రాయగల సామర్థ్యం ఉందని, ప్రభుత్వాలు దృష్టి పెడితే మరింత విస్తరించవచ్చని చెప్పారు.ఆన్‌లైన్ పరీక్షల్లో ప్రశ్నల జంబ్లింగ్, ఐచ్ఛికాల మార్పులు వంటి సదుపాయాలతో కాపీయింగ్, లీక్‌లకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















